రేణిగుంట, తిరుచానూరు రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న CRS లో ఓ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది వేరే సిగ్నల్ ను తనదిగా భావించిన లోకో పైలెట్ ఇంజిన్ ను ముందుకు కదిపారు. ఈ లోపు అసలు ట్రైన్ వస్తుండటంతో ట్రాక్ మార్చే ప్రయత్నంలో ఇంజిన్ పట్టాలు తప్పింది పక్కనే బురదలోకి దిగిపోయింది రైలు ఇంజిన్ లోకో పైలెట్ సిగ్నల్ ను తప్పుగా అర్థం చేసుకోవటంతోనే ప్రమాదం ప్రమాదంలో లోకో పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. అక్కడికి చేరుకున్న రైల్వే సిబ్బంది ఇంజన్ కు మరమ్మతులు చేపట్టారు. ట్రైన్ ఇంజన్ బురదలోకి దూసుకెళ్లి నిలిచిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది