తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. 11-12-2022న 72,466 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,123 మంది స్వామికి తల నీలాలు సమర్పించారు. 4.29 కోట్ల రూపాయలు కానుకలుగా భక్తులు సమర్పించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్‌మెంట్‌ల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది. బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామికి నైవేద్యంగా సమర్పించారు.