హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డు ఎక్కేందుకు మరెంతో కాలం లేదు.



మార్చిలోపు డబుల్ డెక్కర్ బస్సులు నగర రోడ్లపై పరుగులు తీయనున్నాయి.



10 డబుల్ డెక్కర్ బస్సులను టీఎస్ ఆర్టీసీ అందుబాటులో తీసుకురానుంది.



సికింద్రాబాద్ - పటాన్‌చెరు, సికింద్రాబాద్ - మేడ్చల్, సికింద్రాబాద్ - లింగం పల్లి,



అఫ్జల్ గంజ్ - మెహెదీపట్నం, జీడిమెట్ల - సీబీఎస్, పటాన్ చెరు - కోఠి



ఈ రూట్లలో డబుల్ డెక్కర్ బస్సులను తిప్పాలని నిర్ణయించారు. (Pic: కోఠి ఆంధ్రాబ్యాంకు సర్కిల్ వద్ద అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సు)



డబుల్ డెక్కర్ బస్సులను తిప్పే రూట్లలో ఉండే ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, మెట్రో స్టేషన్ల ఎత్తును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.



డబుల్ డెక్కర్ బస్సు ఎత్తుని బట్టి అవి తిరిగేందుకు సాధ్యమయ్యే మార్గాలనే ఎంపిక చేశారు.



ఆర్టీసీ ఇప్పటికే 560 సాధారణ ఎలక్ట్రిక్ బస్సులకు టెండర్లు పిలిచింది. వీటిలో 50 బస్సులు జిల్లాలకు కేటాయించారు.



500 ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ నగరంలో తిప్పనున్నారు.



ఇప్పటికే 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణ ఆర్టీసీలో చేరిన సంగతి తెలిసిందే



ఇటీవలే టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం వీటిని ప్రారంభించింది.