వికారాబాద్ జిల్లా మర్పల్లికి ఏలియన్స్ వచ్చారంటూ ఓ వార్త హల్ చల్ చేసింది. నిజమేంటీ నిగ్గు తేల్చేందుకే ఏబీపీ దేశం రీసెర్చ్ చేసి వివరాలు సేకరించింది. మొగిలి గుండ్ల గ్రామస్తులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంగ్లీషు అక్షరాలు గమనిస్తే.. అది హాలో స్పేస్ వాళ్ల స్పేస్ క్యాప్యూల్ అని తేలింది వాతావరణ పరిశోధనల కోసం నేషనల్ బెలూన్ ఫెసిలిటీ వాళ్లు వాటిని ప్రయోగించారు ఈ హాలో స్పేస్ స్పెయిన్ కు చెందిన ఓ స్పేస్ అడ్వెంచరెస్ సంస్థ. భూమి నుంచి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణాలు నిర్వహించేలా వాహనాలు చేస్తోంది ఫస్ట్ ఫ్లైట్ లో కేవలం మనుషులు లేకుండా ఒట్టి క్యాప్య్సూల్ ను మాత్రమే ప్రయోగించారు. ఈ క్యాప్స్యూల్ ఎగిరేందుకు వీలయ్యే బెలూన్లు TIFR దగ్గర ఉన్నాయి అంతే ఏలియన్స్ లేవు. ఆదిత్య 369 లేదు. అసలు నిజం ఇదే.