Hydకు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్ నసీర్ ఖాన్ అనే యువకుడు దేశంలోనే మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ కార్ కొనుగోలు చేశారు దీంతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. McLaren 765 LT Spider కారు ఖరీదు రూ.12 కోట్లు ఆయన వద్ద ఇంకా ఎన్నో అత్యంత విలాసవంతమైన అంతర్జాతీయ బ్రాండ్ల కార్ల కలెక్షన్ ఉంది. లాంబోర్గిని, రోల్స్ రాయిస్, మెర్సిడీస్ బెంజ్, జీఎంసీ లాంటి అతి ఖరీదైన కార్లను ఆయన సేకరించారు. ఈ కార్లతో ఆయన తరచూ రీల్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటారు. ఆయన గ్యారేజ్‌లో ఉన్న లాంబోర్గిని కారు సైలెన్సర్ నుంచి వచ్చే నిప్పులతో సిగరెట్ వెలిగించారు. ఈ రీల్ వైరల్ అయింది. వీకెండ్స్‌లో, అప్పుడప్పుడూ ఆయన తన లగ్జరీ కార్స్‌తోనే గడుపుతూ రీల్స్ చేస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన నసీర్ ఖాన్‌కు కార్లంటే బాగా ఇష్టం. వ్యాపారవేత్త అయిన ఈయన తరచూ విదేశీ యాత్రలు చేస్తుంటారు. దేశంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఈయన కలెక్ట్ చేసి ఉంచుకున్నారు. తీరిక దొరికినప్పుడల్లా హైదరాబాద్ రోడ్లపై ఆ కాస్ట్ లీ కార్లపై చక్కర్లు కొడుతుంటారు.