పకోడీలు నీటిలో వేస్తే మెత్తగా అయిపోతాయి కదా క్రిస్పీగా ఎలా ఉంటాయని అనుకుంటున్నారా?



కానీ నూనె తక్కువగా ఉపయోగించాలని అనుకునే వారికి ఇది చక్కని ఎంపిక.



పకోడీకి కావాల్సిన శెనగపిండి, ఉప్పు, కారం ఇలా అన్నీ కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి.
మరొక పాన్ లో నీటిని బాగా మరిగించుకోవాలి.


నీరు బాగా బాయిల్ అయిన తర్వాత చేతులతో లేదా స్పూన్ తో పకోడీలు వేసుకోవచ్చు.



వేడి వేడి నూనెలాగా మరిగే నీరు కూడా బాగా పని చేస్తుంది. దీని వల్ల పిండి నీటిలో కలవకుండా ఉంటుంది.



పకోడీలు మునిగే వరకు నీరు ఉండేలా చూసుకోవాలి.
అవి నీటి వేడికి రంగు మారడం ప్రారంభమయితే అవి ఉడుకుతున్నాయని అర్థం.


ఉడికిన వాటిని బయటకి తీసి నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి



అంతే ఎంతో సింపుల్ గా చేసే పకోడీలు రెడీ అయిపోయినట్టే. గ్రీన్ చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు.



Images Credit: Pixabay/ Pexels/ Unsplash