చర్మాన్ని కాంతివంతం చేసుకునేందుకు రెగ్యులర్ గా వేసుకునే ఫేస్ ప్యాక్ తో సంతృప్తి చెందడం లేదా?



అయితే ఈ కొత్త ఫేస్ ప్యాక్ ట్రై చేసి చూడండి. సింపుల్ గా కిచెన్ లో దొరికే వాటితో అందం పెంచుకోవచ్చు.



అందుకోసం మీ దగ్గర టొమాటో, పసుపు ఉంటే చాలు. ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలంటే..



టొమాటోని బాగా కడిగి గిన్నెలోకి తీసుకుని మెత్తగా గుజ్జు చేసుకోవాలి.
అందులో పసుపు వేసి పేస్ట్ మాదిరిగా బాగా కలపాలి.


పసుపు, టొమాటో ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. మేకప్, దుమ్ము లేకుండా చూసుకోవాలి.



ఈ మిశ్రమాన్ని ఫేస్ మొత్తం సమానంగా అప్లై చేసుకోవాలి. కంటికి మాత్రం ఇది తగలకుండా చూసుకోవాలి.



ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి.



పూర్తిగా కడిగే ముందు చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడానికి
ముఖాన్ని వృత్తాకార కదలికలో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.


మీది ఫెయిర్, సెన్సిటివ్ స్కిన్ అయితే పసుపు తగ్గించుకుని రాసుకోవచ్చు.



పెరుగు, తేనె వంటి సహజ ఉత్పత్తులు కూడా యాడ్ చేసుకోవచ్చు.
Images Credit: Pexels