భారతీయ వంటల్లో అల్లం చాలా ముఖ్యమైన మసాలాగా చెప్పవచ్చు. అల్లంతో చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వికారం, మార్నింగ్ సిక్ నెస్, ఇన్ఫ్లమేషన్ వంటి సమయాల్లో అల్లం మేలు చేస్తుంది. అయితే అల్లం మోతాదుకు మించి తీసుకుంటే కొత్త సమస్యలు రావచ్చట. అల్లం జీర్ణ వ్యవస్థను స్టిమ్యూలేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో తింటే కడుపునొప్పి, డయేరియా రావచ్చు. అల్లం సహజమైన బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్. అందుకే గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఇప్పటికే బ్లడ్ థిన్నింగ్ కోసం ఆప్స్రిన్ వంటి మందులు వాడుతున్న వారికి రక్తస్కందన సమస్యలు రావచ్చు. అల్లం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. డయాబెటిక్స్ మందులతో పాటు అల్లం కూడా ఎక్కువ తీసుకుంటే హైపోగ్లైసిమియా సమస్య రావచ్చు. బీపీ, షుగర్ మందులను అల్లం వినియోగం ప్రభావితం చేస్తుంది. ఈ మందులు వాడేవారు అల్లం వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత మందిలో అల్లం నేరుగా తాకినపుడు స్కిన్ ఇరిటేషన్స్ రావచ్చు. ఎర్రని దద్దుర్లు కనిపిస్తే అల్లం వాడడం మానెయ్యడం మంచిది. బీపీ, షుగర్ వంటి సమస్యలున్నపుడు , మందులు వాడుతున్నపుడు అల్లం వాడే విషయంలో జాగ్రత్త అవసరం. Representational image:Pexels