ఎంత ముందుగా క్యాన్సర్ నిర్ధారణ చేస్తే అంత సమర్థవంతంగా క్యాన్సర్ ను నయం చెయ్యవచ్చు. కొన్ని బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుందాం. కారణం చెప్పలేని అలసట వేధిస్తంది. ఇది రక్త హీనత వల్ల కావచ్చు. క్యాన్సర్ వల్ల రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఎలాంటి ప్రయత్నం లేకుండా అకస్మికంగా బరువు తగ్గడం. క్యాన్సర్ వల్ల జీవక్రియలో మార్పులు జరగవచ్చు. బ్లడ్ క్యాన్సర్ కణాలు నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. కనుక తరచుగా ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. చిన్న గాయాలకే చాలా రక్తస్రావం కావచ్చు. రక్త స్కందన సామర్థ్యం తగ్గిపోతుంది. లింఫ్ నోడ్స్ నిరోధక వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు. లింఫ్ నోడ్స్ లో వాపు లింఫోమాకు సంకేతం కావచ్చు. బ్లడ్ క్యాన్సర్ వల్ల ఎముకలు ప్రభావానికి లోనవుతాయి. ఎముకల్లో నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటుంది. వాతావరణంతో సంబంధం లేకుండా రాత్రి పూట చెమటలు రావడం బ్లడ్ క్యాన్సర్ లక్షణం కావచ్చు. Representational image:Pexels