ఈ రసంతో మధుమేహం అదుపులో



డయాబెటిస్ రోగంతో బాధపడేవారు కాకరకాయకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారానికి కనీసం మూడు నుంచి నాలుగు సార్లు కాకరకాయతో చేసిన వంటకాలను తినాలి.



ప్రతిరోజు కాకరకాయ రసాన్ని తాగితే ఎంతటి మధుమేహం అయినా అదుపులోకి వచ్చేస్తుంది.



కాకరకాయలో మరెన్నో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, విటమిన్ సీ భారీగా ఉంటాయి.



ఆరోగ్యపరమైన కొవ్వులు, ప్రోటీన్ కూడా ఉంటుంది. కాబట్టి కాకరకాయను ఎవరు తిన్నా ఆరోగ్యమే.



ప్రతిరోజూ చిన్న గ్లాస్ తో కాకరకాయ రసాన్ని తాగితే మధుమేహ రోగులు ఉపశమనం పొందుతారు.



రెండు వారాలు తాగి చూడండి. మీకే అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపులో ఉంటాయి.



రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు అంటే షుగర్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు మాత్రం పరగడుపున ఖాళీ పొట్టతో కాకరకాయ రసాన్ని తీసుకోకపోవడం మంచిది.



ఇది మరింతగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల నీరసంగా అనిపించవచ్చు.