చెర్రీ టమోటోలను తింటే గుండెకు రక్ష



చెర్రీ టమోటోలు చిన్నవిగా ఉంటాయి. టమోటోలలో ఇవి ఒక రకం. ఇవి ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటాయి.



వారానికి ఒకటి నుంచి రెండుసార్లు అయినా ఈ చెర్రీ టమోటాలను తింటే ఎంతో ఆరోగ్యకరం అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.



వీటిని తినడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా తగ్గుతుంది.



చర్మ సమస్యల నుంచి కూడా చెర్రీ టమాటాలని అద్భుతమైన గుణాలు కాపాడతాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్న పోషకాలు మాత్రం నిండుగా ఉంటాయి.



ఈ బుజ్జి టమాటాల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే లైకోపీన్, పొటాషియం కూడా నిండుగా ఉంటాయి.



లైకోపీన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మన శరీరానికి చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.



పొట్టలోని మంచి బ్యాక్టీరియా ఆరోగ్యంగా ఉండాలంటే చెర్రీ టమోటాలను తింటూ ఉండాలి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.



ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా మగవారిని ఈ చెర్రీ టమాటాలు కాపాడతాయి.