ఇంట్లో ఆస్తమా రోగులు ఉంటే ఈ జాగ్రత్తలు తప్పవు



ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ప్రపంచంలో దాదాపు 23.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు.



మనదేశంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మంది ఆస్తమా రోగులు ఉన్నట్టు అంచనా.



ఇంట్లో ఆస్తమా రోగులు ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆస్తమా అనేది ఒక దీర్ఘకాలిక శ్వాస సంబంధ వ్యాధి.



ఇంట్లో మంచి సువాసన కోసం ఎంతోమంది పరిమళాన్ని వెదజల్లే కొవ్వొత్తులను వెలిగిస్తారు.



అలాగే అగరబత్తీలను కూడా వెలిగిస్తారు. ఇవి ఆస్తమా రోగులకు చికాకు తెప్పిస్తాయి.



వాటి నుండి విడుదలయ్యే పొగ గాలిలో చేరి ఆస్తమాకు ట్రిగ్గర్ గా మారుతుంది. వారికి గాలి పీల్చుకోవడం కష్టంగా అవుతుంది.



దీర్ఘకాలంగా ఇలా ఆస్తమా రోగులు ఇంట్లో క్యాండిల్స్, అగరబత్తులు నుంచి వచ్చే గాలిని పీలుస్తూ ఉండడం వల్ల వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.



బార్బెక్యూ వంటి వంట పద్ధతులకు కూడా ఆస్తమా రోగులు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.