కొత్తిమీరతో చాలా రోగాలకు చెక్ పెట్టొచ్చు! కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ కణాలను దెబ్బతీయకుండా కాపాడుతాయి. కొత్తిమీర శరీరంలోని అదనపు సోడియంను బయటికి పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొత్తిమీర ఎల్‌డీఎల్ అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. శరీరంలో క్యాన్సర్ సెల్స్ వృద్ధిని కొత్తిమీర నివారిస్తుంది. గ్యాస్, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసంతో ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీర ఆకులు నమిలితే నోట్లో అల్సర్లు, పగుళ్లు, చిగుళ్ల నొప్పులు, దుర్వాసన పోతాయి. కొత్తిమీర రోజూ తీసుకుంటే వాతం, బీపీ, డయాబెటిస్ వ్యాధులు తగ్గిపోతాయి. కొత్తిమీర లోని విటమిన్ కె ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. డయాబెటిస్ పేషెంట్లు కొత్తిమీర తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. All Photos Credit: pixabay.com