గంటల తరబడి కంప్యూటర్, ల్యాప్ టాప్ ముందు కూర్చుని పని చేసుకుంటూ ఉండటం వల్ల నడుము నొప్పి వేధిస్తుంది.



ఆహార పదార్థాల ద్వారా కూడా వెన్ను నొప్పి సమస్యని అధిగమించవచ్చు.



అవిసె గింజలు, చియా గింజలు వంటి వాటిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.



ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.



అల్లం, వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది.



రోజూ పాలు, గుడ్లు, పప్పులు వంటివి చేర్చుకుంటే మంచిది.
ఇది కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది.


బ్రకోలి, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర వంటి ఆకుకూరలు చేర్చుకోవచ్చు.
వాపు, నొప్పులని తగ్గిస్తాయి.


యాపిల్స్, పైనాపిల్, బెర్రీలు, చెర్రీస్, ద్రాక్ష, సిట్రస్ పండ్లు ఆహారంలో చేర్చుకోవాలి.



పండ్లు, లీన్ ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటివి వెన్నెముక, కండరాలని బలంగా మారుస్తాయి.
Images Credit: Pexels