తలనొప్పి రావడానికి వివిధ కారణాలు ఉంటాయి.

ఆరోగ్యపరమైన, మానసిక ఒత్తిడి వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

అయితే ఆ సమయంలో పడుకుంటే కాస్త దానిని నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలా నిద్రపోవడం కుదరని సమయంలో మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వొచ్చు.

ఎక్కువ నీరు తాగండి. కొన్నిసార్లు డీహైడ్రేషన్​ వల్ల కూడా తలనొప్పి వస్తుంది.

ఎసెన్స్​ ఆయిల్స్​ని అప్లై చేయొచ్చు. ఇవి తలలోని నరాలకు విశ్రాంతినిస్తాయి.

ప్రెజర్ పాయింట్స్​ని మసాజ్ చేసుకోండి. ఇది మీకు కచ్చితంగా ఉపశమనం ఇస్తుంది.

తలనొప్పి తగ్గేందుకు కాఫీ లేదా టీ తాగుతారు. కానీ వాటికి దూరంగా ఉండడమే మంచిది. (Images Source : Unsplash)