చలికాలంలో అందరికీ వెచ్చగా ఉండాలని ఆశగా ఉంటుంది. ఇందుకు ఏం తీసుకుంటే మంచిదో చూద్దాం.

చల్లని వాతావరణంలో వెచ్చగా చాయ్ తాగితే ఆ సుఖమే వేరు. కొద్దిగా అల్లం, మిరియాలు చేరిస్తే ఆరోగ్యం కూడా.

కాల్చిన చిలగడ దుంపలు వేడిగా తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.

కూరగాయల్లోని పోషకాలు నష్టపోకుండా తీసుకోవాలంటే సలాడ్ తర్వాత స్థానం సూప్ దే. వెచ్చగా వెజిటబుల్ సూప్ తీసుకుంటే సరి.

అందరికి నచ్చే స్నాక్ పాప్ కార్న్. కొద్దిగా మసాలాలు చేర్చి పాప్ కార్న్ తయారుచేసుకుని తింటే రుచీ, ఆరోగ్యం రెండూ దొరుకుతాయి.

పల్లీలు, బాదాములు, ఆక్రూట్ ఇలా గింజలేవైనా సరే కాస్త దాల్చిన చెక్క చేర్చి వేయించి తింటే ఆరోగ్యం, ఆనందం మీ సొంతం.

వేడిగా హాట్ చాక్లెట్ డ్రింక్ నచ్చని వారెవరు? కాస్త నట్ పౌడర్ తో డార్క్ చాక్లెట్ డ్రింక్ తాగితే రుచి, ఆరోగ్యం.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!

Images courtesy : Pexels