చర్మం, జుట్టు యవ్వనంగా మెరిసేందుకు అవసరమయ్యే పోషకం కొల్లాజెన్. దీన్ని పెంచేందుకు ఏం చెయ్యాలో తెలుసుకుందాం. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. కనుక కొల్లాజన్ ఉత్పత్తికి ఇవి చాలా అవసరం. విటమిన్ సి తోపాటు జింక్, కాపర్ వంటి పోషకాలు కలిగిన కాలే, పాలకూర, బచ్చలి వంటి ఆకుకూరల వల్ల కూడా శరీరంలో కొల్లాజన్ పెరుగుతుంది. లైకోపిన్ అనే ఎర్రని పిగ్మెంట్ కలిగిన టమాటలు కొల్లాజన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే సంత్ర, ద్రాక్ష, కివి, జామ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు మరింత మేలు చేస్తాయి. కొల్లాజన్ ఉత్పత్తికి చికెన్ లోని చర్మం, కార్టిలేజ్ దోహదం చేస్తుంది. బరువు తగ్గడం మాత్రమే కాదు కొల్లాజన్ ఉత్పత్తికి కూడా గుడ్డు తినడం మంచిది. కెటాచిన్ అనే యాంటీఆక్సిడెంట్ కలిగిన గ్రీన్ టీ కొల్లాజన్ ఉత్పత్తి పెంచుతుంది. చర్మం, జుట్టు యవ్వనంతో మెరుస్తాయి. గుమ్మడి గింజలు, జీడిపప్పు, బాదాములు, నువ్వులు, అవిసె గింజల్లో జింక్, కాపర్ ఫుష్కలం. వీటితో కొల్లాజన్ పెరుగుతుంది. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అనుమాన నివృత్తికి నిపుణులను సంప్రదించాలి Images courtesy : Pexels