మనం రోజువారీ తీసుకునే ఆహారంలో కొన్ని గుండె మీద తీవ్రమైన ప్రభావం చూపుతాయి.

అందుకే ఆహారం తీసుకునే సమయంలో గుండె ఆరోగ్యాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పాలకూర, బచ్చలికూర, లెట్యూస్ వంటి ఆకుపచ్చని కూరగాయలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఫైబర్ ఎక్కువగా ఉండే ఓట్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

చేపనూనె లో ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరాయిడ్లను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

ఒమెగా3ఫ్యాటీ ఆసిడ్లు, మోనోసాచ్యూరేటెడ్ కొవ్వులు కలిగిన బాదాములు, అక్రూట్ వంటి గింజలు గుండె ఆరోగ్యానికి మంచివి.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి బెర్రీలు బీపి అదుపులో ఉంచి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.

మోనోసాచ్యూరేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా కలిగిన ఆలీవ్ నూనె యాంటిఆక్సిడెంట్లతో మంచి పోషకాహారం.

ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అనుమాన నివృత్తికి నిపుణులను సంప్రదించాలి



Images courtesy : Pexels