శ్రియా శరణ్ తన అందంతోనే కాకుండా.. ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఎందరో మనసులు కొల్లగొట్టింది. సాంప్రదాయ దుస్తుల్లో కూడా తన ఫ్యాషన్ టచ్ ఉండేలా చూసుకుంటుంది. ఫ్లోరల్, మల్టీపుల్ కలర్ డీప్ నెక్ బ్లౌజ్ ఎలాంటి పార్టీకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు ట్రెండ్‌ని ఫాలో అయ్యేవారు అయితే ఇలాంటి డీప్‌నెక్ బ్లౌజ్‌కు లాంగ్ స్లీవ్స్ జత చేసుకోవచ్చు. ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ మీరు రెడీ చేసుకుంటే ఎలాంటి చీరకైనా బాగా నప్పుతుంది. స్లీవ్ లెస్, వీ నెక్ బ్లౌజ్ కూడా మీ లుక్‌ని ఎలివేట్ చేస్తుంది. ట్రెడీషన్ లుక్ కోసం మీరు ఫుల్ లెంగ్త్ హ్యాండ్స్, హై నెక్ బ్లౌజ్‌ను డిజైన్ చేయించుకోవచ్చు. మోచేయి వరకు మిర్రర్స్‌తో కూడిన బ్లౌజ్ డిజైన్ మీరు మెరిసేలా చేస్తుంది. (Images Source : Instagram)