ఈ ఏడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన టాప్-10 సౌత్ హీరోయిన్లు వీళ్లే! తాజాగా తల్లైన కాజల్ అగర్వాల్ టాప్-100 ఏసియన్ లిస్టులో 15వ స్థానాన్ని దక్కించుకుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత 18వ స్థానాన్ని దక్కించుకుంది. ‘పుష్ప’ సినిమా హిట్ తర్వాత రష్మిక 20వ స్థానంలో నిలిచింది. విఘ్నేష్ తో పెళ్లి అనంతరం నయనతార 33వ స్థానాన్ని పొందింది. ‘బబ్లీ బౌన్సర్’ మూవీ తర్వాత తమన్నా 37వ ర్యాంక్ ను పొందింది. ‘సర్కస్’ బ్యూటీ పూజా హెగ్డే 44వ స్థానంలో నిలిచింది. ‘బాహుబలి’ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి 56వ స్థానం సంపాదించింది. ‘మహానటి’ బ్యూటీ కీర్తి సురేష్ 62వ స్థానంలో నిలిచింది. అతిలోక సుందరి శ్రీదేవి 75వ స్థానంలో సరిపెట్టుకుంది. ‘ఇండియన్-2’ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ 91వ స్థానంలో నిలిచింది. Photos Credit: twitter