తమన్నాకు పెళ్లి వయసు వచ్చేసిందని కొంత మంది ఫీలింగ్. 

ముంబైకు చెందిన వ్యాపారవేత్తను తమన్నా పెళ్లి చేసుకోనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.

తన పెళ్లిపై వచ్చిన వార్తలను తమన్నా ఖండించారు అనుకోండి.

అయితే... ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తమన్నాను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారట. 

''సాధారణంగా ప్రతి ఇంట్లో అమ్మాయిలను ఒత్తిడి చేసినట్టు... మా ఇంట్లో కూడా పెళ్లి ప్రెజర్ ఉంది'' అని తమన్నా చెప్పారు. 

ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, అయితే తాను ఏ నిర్ణయం తీసుకోలేదని తమన్నా తెలిపారు. 

తమన్నా నటించిన 'గుర్తుందా శీతాకాలం' ఈ శుక్రవారం విడుదల అవుతోంది.

'గుర్తుందా శీతాకాలం' తర్వాత మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో తమన్నా నటిస్తున్నారు. 

తొలిసారి తమన్నా ఓ మలయాళ సినిమాకు సంతకం చేశారు. 'బాంద్రా' అనే సినిమా చేస్తున్నారు.