కష్టాలను దాటి అవకాశాల వైపు అడుగులు - శ్వేతబసు గురించి ఈ విషయాలు తెలుసా? ‘కొత్త బంగారు లోకం‘ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది శ్వేత బసు ప్రసాద్. ‘ఎక్కాడా!’ అంటూ ముద్దు ముద్దు మాటలతో ఆడియెన్స్ ను అలరించింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడం ఆమె జీవితం అనుకోని మలుపు తిరిగింది. 2014లో వ్యభిచారం కేసులో పట్టుబడింది. కొంతకాలం పాటు మానసిక వేదనకు గురైనా, మళ్లీ జీవితంలో నిలబడింది. దర్శకుడు రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుంది. ఏడాది నిండకముందే విడిపోయింది. శ్వేతా.. హిందీలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టింది. 'ఇక్బాల్' సినిమాతో బాల నటిగా వెండి తెరకు పరిచయం అయ్యింది. తొలి మూవీతోనే ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకుంది. పలు సీరియల్స్ తో పాటు యాడ్స్ లోనూ నటించింది. బెంగాలీ, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ మీద ఫోకస్ పెట్టింది.. బొద్దుగా ఉన్న తను సన్నగా మారింది. Photos Credit: Shweta Basu Prasad/Instagram