ఫైమా బిగ్ బాస్ ఇంట్లో నుంచి బయటకి వచ్చిన తర్వాత ఇద్దరూ కలుసుకుని ఎంజాయ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టిన గీతూ ఇంట్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తన మొండితనంతో విన్నర్ క్వాలిటీస్ ఉన్న గీతూ ప్రవర్తన కారణంగా ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు గీతూ లాగా ఫిజికల్ టాస్క్ లో ఎవరూ బాగా ఆడింది లేదు. జబర్దస్ట్ ద్వారా లేడి కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫైమా తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది. ఫిజికల్ టాస్క్ లో కూడా ఎక్కడ తగ్గకుండా ఎదుటి వారికి గట్టి పోటి ఇచ్చి ఇప్పటి వరకి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అందరి మన్ననలు పొందింది. బయట తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకుంది కానీ ఇంట్లో మాత్రం ఆపని చేయలేకపోయింది. బిగ్ బాస్ ఇంట్లో చేసిన రచ్చ గురించి త్వరలోనే ఒక బ్లాగ్ చేస్తానని గీతూ చెప్పింది.