దేశవ్యాప్తంగా ఎన్నో పొడవైన వంతెనలున్నాయి.

అసోంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన Dhola Sadiya వంతెన దేశంలో అత్యంత పొడవైంది. దీని పొడవు 9.15 కిలోమీటర్లు.

అరుణాచల్‌ప్రదేశ్ దిబాంగ్ నదిపై నిర్మించిన Dibang River Bridge రెండో అతిపెద్ద వంతెన. దీని పొడవు 6.15 కిలోమీటర్లు.

బిహార్‌లో గంగానదిపై నిర్మించిన ఈ వంతెన పేరు మహాత్మ గాంధీ సేతు. 5.75 కి.మీ. పొడవైన ఈ బ్రిడ్డ్‌ను ఇందిరా గాంధీ హయాంలో నిర్మించారు.

మహారాష్ట్రలోని బంద్రా వార్లీ సీ లింక్ దేశంలో నాలుగో అతి పెద్ద వంతెన. రూ.750 కోట్లతో నిర్మించిన ఈ బ్రిడ్జ్ పొడవు 5.57కి.మీ.

అసోంలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన బోగిబీల్ బ్రిడ్జ్. ఇండియాలో అతి పెద్ద రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ ఇదే.

బిహార్‌లో భగల్‌పూర్ వద్ద గంగా నదిపై ఈ విక్రమ్‌శిల సేతు నిర్మించారు. ఈ 5వ అతి పెద్ద వంతెన పొడవు 4.7 కిలోమీటర్లు.

కేరళలోని కొచ్చిలో వెంబనాడ్ సరస్సుపై వెంబనాడ్ రైలు వంతెన నిర్మించారు. దీని పొడవు 4.62 కిలోమీటర్లు.

బిహార్‌లోనే గంగానదిపై నిర్మించిన Digha Sonpur రైల్‌ రోడ్ బ్రిడ్జ్‌ పొడవు 4.55 కిలోమీటర్లు. దీనినే జేపీ సేతుగా పిలుస్తారు.

బిహార్‌లో అర్రా చప్రా వంతెనను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని పొడవు 4.35 Km.

రాజమండ్రిలో గోదావరిపై నిర్మించిన బ్రిడ్జ్‌ దేశంలోనే పదో అతి పెద్ద వంతెన. (Images Credits: trickytravellers)