ఎన్నో ట్విస్ట్‌ల తరవాత ట్విటర్ మస్క్ హస్తగతమైంది. ట్విటర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఇలా నవ్వుతూ కనిపించారు మస్క్.

ఈ ఏడాది మార్చిలో ట్విటర్‌లో 9.4% స్టేక్‌ను ఎలన్ మస్క్ సొంతం చేసుకున్నారు. అప్పుడు మొదలైంది ఈ డీల్.

ఏప్రిల్ 5వ తేదీన ఎలన్ మస్క్‌ను ట్విటర్ బోర్డ్ సభ్యుడిగా ఎన్నుకున్నారు.

ఏప్రిల్ 14న ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు 44 బిలియన్ డాలర్లకు బిడ్ వేసినట్టు మస్క్ ప్రకటించారు.

కొన్ని కీలక వివరాలు కావాలని మస్క్ డిమాండ్ చేశాడు. ట్విటర్‌పై కొన్ని ఆరోపణలు కూడా చేశాడు.

అప్పటి నుంచి డీల్‌లో డిస్టర్బెన్స్ మొదలైంది. మస్క్‌పై చర్యలు తీసుకుంటామని ట్విటర్ వెల్లడించింది.

ఈ వ్యవహారం కోర్టుకెక్కాక మస్క్ మనసు మార్చుకున్నాడు. అక్టోబర్ 17న ట్విటర్‌ కొనుగోలుపై ఆసక్తి ఉందని మరోసారి చెప్పాడు.

మొత్తానికి డీల్ క్లోజ్ చేసి ఎలన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకున్నాడు. (Image Credits: PTI, Twitter)