మీరు బ్రష్ చేసే విధానం చాలా తప్పు - ఇలాగైతే దంత సమస్యలు తప్పవు

దంతాలను బ్రష్‌తో శుభ్రం చేసుకోవడం మంచి అలవాటే. కానీ, దానికి కొన్ని పద్ధతులున్నాయి. అవేంటో తెలుసుకోండి.

బ్రష్‌తో పళ్లను మరీ గట్టిగా తోమొద్దు. అలా చేస్తే పళ్లను కాపాడే ఎనామిల్ దెబ్బతింటుంది.

బ్రష్‌ను కేవలం వెనక్కి ముందుకే కాదు, అన్ని దిశల్లో తిరిగేలా తిప్పండి. అప్పుడే మూలలన్నీ శుభ్రమవుతాయి.

ఒకే బ్రష్‌ను ఎక్కువ రోజులు వాడొద్దు. రోజులు గడిచేకొద్ది అది ప్రభావంతంగా పళ్లను క్లీన్ చేయలేదు.

పళ్లకు ‘హార్డ్’ బ్రష్‌ను వాడొద్దు. అది పళ్లు, చిగుళ్లను పాడు చేస్తుంది. ‘సాఫ్ట్’ బ్రష్ మాత్రమే వాడండి.

బ్రష్ చేసిన వెంటనే నోటిని కడగొద్దు. కాస్త టైమివ్వండి.

ఎందుకంటే.. పేస్టులోని ఫ్లోరైడ్లు పళ్లను శుభ్రం చేస్తాయి. వెంటనే కడిగేస్తే దాని ప్రభావం పోతుంది.

Images Credit: Pixabay and Unsplash