చాలా మంది నిలబడి నీళ్ళు తాగేస్తారు. కానీ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిలబడి నీళ్ళు తాగకూడదు. అలా చేస్తే కీళ్లలో అదనపు ద్రవాలు పేరుకుపోవడానికి, ఆర్థరైటిస్ సమస్య ఏర్పడేందుకు దారి తీస్తుంది. అందుకే ఖచ్చితంగా కూర్చుని నీళ్ళు తాగాలి. ఆయుర్వేదం ప్రకారం నిలబడి ఏదైనా తాగడం వల్ల శరీరంలోని ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. నీళ్ళు తొందరగా తాగడం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. అదే కొద్ది కొద్దిగా తాగడం వల్ల జీర్ణక్రియకి సహాయపడుతుంది. శీతాకాలంలో ఎప్పుడు మామూలు నీళ్ళు లేదా గోరువెచ్చని నీటిని తాగాలి. చల్లటి నీళ్ళు జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. వెచ్చని నీరు జీర్ణక్రియకి మరింత సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ని నియంత్రిస్తుంది. నిద్రలేచిన వెంటనే నీరు తాగాలని ఆయుర్వేదం సూచిస్తోంది. శరీరం నుంచి విషాన్ని బయటకి పంపించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగులని క్లియర్ చేస్తుంది. శరీరాన్ని బాగా హైడ్రేట్ చేస్తుంది. రాగి లేదా వెండి పాత్రల్లో నీటిని నిల్వ చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. వాటిలోని నీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.