క్యాబేజీ తింటే బరువు పెరగరు క్యాబేజీ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో మొదటి స్థానంలో ఉంటుంది. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, ఫైబర్, జింక్, ఫాస్పరస్, ఫోలేట్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. క్యాబేజీని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. 100 గ్రాముల క్యాబేజీలో దాదాపు 25 క్యాలరీలు ఉంటాయి. దీనిలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యాబేజీ తినడం వల్ల పొట్ట నిండినట్లుగా ఉంటుంది. దానివల్ల ఆకలి తగ్గుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. క్యాబేజీలో ఉండే పీచు మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గేలా చేస్తుంది. క్యాబేజీలో కొవ్వు పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది.కాబట్టి ఎంత తిన్నా బరువు పెరగరు.