యాంటీ ఆక్సిడెంట్లు, టానిన్లు కలిగిన సపోటా తినడం వల్ల ఆరోగానికి అనేక ప్రయోజనాలు చేకూరతాయి. ఇందులో విటమిన్ ఏ, బి,ఇ సమృద్ధిగా ఉన్నాయి. ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడే ఐరన్, కాల్షియం ఉన్నాయి. ఇందులో డైటరీ ఫైబర్ ఉంటుంది. జీర్ణక్రియ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని విటమిన్ ఏ కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గర్భిణీలకు పాలిచ్చే తల్లులకి గొప్ప ఆహారం కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిల్ని పెంచుతుంది. మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది. రోజు సపోటా జ్యూస్ తాగడంవల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.