మన బుట్టబొమ్మ పూజా హెగ్డేకు సినిమాలు ఎక్కువే.. ఫ్లాపులు కూడా ఎక్కువే. పూజా చేసిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ పూజా అందానికి అభిమానులు ఫిదా అవుతూంటారు. తన స్మైల్ అండ్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తోన్న బ్యూటీ. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూజా.. మాతుఝే సలాం సాంగ్ తో కనిపించింది. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ను పూజా ఇలా సెలబ్రేట్ చేసుకుంది. ఇటీవలే 'గుంటూరు కారం'లో ఛాన్స్ మిస్ చేసుకున్న పూజా. ప్రస్తుతం రవితేజ - గోపీచంద్ కాంబోలో రాబోతున్న సినిమాలో పూజా నటించనున్నట్టు టాక్. Image Credits: Pooja Hedge/Instagram