టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికితే ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడతాడు. కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ టూర్లకు వెళ్తుంటాడు. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి ఎంజాయ్ చేస్తాడు. ప్రస్తుతం ప్రిన్స్ కుటుంబం లండన్ ట్రిప్ లో ఉంది. వీరంతా కలిసి లండన్ హైడీ పార్క్ లో సందడి చేశారు. నేచర్ అందాలను ఆస్వాదిస్తూ సరదాగా గడిపారు. కూతురు సితారతో కలిసి తల్లి నమ్రత ఫోటోలకు ఫోజులిచ్చింది. లండన్ యాత్రకు సంబంధించిన ఫోటోలను నమత్ర ఇన్ స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photos Credit: Namrata Shirodkar/Instagaram