వందేళ్లు జీవించాలా? ఇలా చేయండి

ఒక మనిషి జీవిత కాలపరిమితి వందేళ్లు. కానీ ఆ వందేళ్లు నిండుగా జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది?

ఎవరైతే ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకుంటారో, అందులోనూ నీళ్లు ఎక్కువగా తాగుతారో, వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు ఆ అధ్యయనం నిరూపించింది.

నీళ్లు ఎక్కువగా తీసుకుంటున్న వారిలో గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు చాలా తక్కువగా వస్తున్నట్లు తెలిసింది.

నీరు ఎక్కువగా తాగితే రక్తంలోని ప్లాస్మాలో సోడియం స్థాయిలు తక్కువగా ఉంటాయి.

ఇలా తక్కువగా ఉంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అలా జీవితకాలం పెరుగుతుంది.

ప్లాస్మా సోడియం స్థాయిలు ఎక్కువగా ఉన్న పెద్దల్లో గుండె ఆగిపోవడం, స్ట్రోక్ రావడం, ధమని వ్యాధులు రావడం, మానసిక సమస్యలు, మధుమేహం వంటివి రావచ్చు.

రోజుకు ఒక మనిషి 8 నుంచి 12 గ్లాసుల నీళ్లు తాగాలి.

నిద్ర లేచిన వెంటనే గ్లాసు నీళ్లు తాగేయాలి. దాహం వేసినా, వేయకపోయినా ఇది కచ్చితంగా పాటాంచాలి.