పిల్లల కోసం పాలకూర కిచిడీ

బియ్యం - అర కప్పు
పాలకూర - రెండు కట్టలు
పెసర పప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఉల్లిపాయ - ఒకటి

గరం మసాలా - అర స్పూను
మిరియాల పొడి - పావు స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - అర స్పూను
పసుపు - చిటికెడు
నెయ్యి - రెండు స్పూన్లు

పాలకూరను నూనెలో పసుపు వేసి వేయించి మెత్తని పేస్టులా చేసుకోవాలి. బియ్యం, పెసరపప్పు ముందే నానబెట్టుకోవాలి.

స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు స్పూన్ల నెయ్యి వేసి జీలకర్ర, మిరియాల పొడి, ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా వేసి వేయించాలి.

అన్నీ వేగాక పాలకూర పేస్టు వేసి కలపాలి. అందులో బియ్యం, పెసరపప్పు, ఉప్పు వేసి కలుపుకోవాలి.

అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టు కోవాలి. మూడు విజిల్స్ తరువాత ఆపేయాలి.

కావాలనుకుంటే పోపు వేసుకోవచ్చు. లేదా అలా నేరుగా తినవచ్చు.