ఖాళీ పొట్టతో టీ తాగవచ్చా? పరగడుపున ఖాళీ పొట్టతో టీ తాగడం మంచిదేనా? అంత మంచిది కాదని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఏదైనా ఆహారం తిన్నాకే టీ తాగాలి. ఖాళీ పొట్టతో టీ తాగకూడదు. ఖాళీ పొట్టతో టీ తాగడం వల్ల ఛాతీలో మంట పుడుతుంది. టీలో ఉండే థియోఫిలిన్ శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది. మలబద్ధకం కూడా వేధిస్తుంది. టీలో ఉండే పదార్థాల వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. టీ అధికంగా తాగితే ఈ సమస్య మొదలవుతుంది. ఖాళీ పొట్టతో టీ తాగితే పొట్ట ఉబ్బరం, పొట్టలో గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పరగడుపున టీ తాగడం వల్ల కొందరిలో గుండె కొట్టుకునే రేటు మారుతుంది. కాబట్టి ఖాళీ పొట్టతో టీ తాగకూడదు. రోజులో రెండు సార్లకు మించి టీ తాగకపోవడం ఉత్తమం.