కళ్లు పొడిబారకుండా ఉండాలంటే...



స్క్రీన్ టైమ్, కాలుష్యం వల్ల కళ్లు పొడి బారిపోతాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.



కంప్యూటర్లు, మొబైల్స్ వంటివి ఎక్కువ సేపు చూడకూడదు. తరచూ రెప్పలు వాల్చుతూ ఉండాలి.



ప్రతి గంటన్నరకి ఒకసారి బ్రేక్ తీసుకుని కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవాలి.



కళ్లని చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉండాలి.



డ్రై ఐస్ సమస్య ఉన్న వారు దానికి తగిన ఐ డ్రాప్స్ ను వైద్యుల సలహాతో వాడుతూ ఉండాలి.



పొడి కళ్ల బారిన పడకుండా ఉండాలంటే నీళ్లు అధికంగా తాగాలి.



నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, కీరా, స్ట్రాబెర్రీ వంటి పండ్లను అధికంగా తినాలి.



కళ్ల కోసం చేపలను అధికంగా తినాలి. అలాగే ప్రతి రోజూ వాల్ నట్స్, బాదం వంటివి నీళ్లలో నానబెట్టి తింటూ ఉండాలి.