తిరుమలలో రాజకీయాలు బంద్- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలివే

శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలని టీటీడీ పాలక మండలి సోమవారం జరిగిన భేటీలో నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో రాజకీయ విషయాలు మాట్లాడకూడదు, ప్రచారం చేయయకూడదు. కాని పక్షంలో వారిపై చర్యలు

శ్రీనివాస సేతు వంతెనకు గడుణ వారధిగా నామకరణం చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది

ప్ర‌తి నెలా మొద‌టి మంగ‌ళ‌వారం తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు

2 నుంచి 3 గంటల్లోగా శ్రీవారి భక్తులకు సర్వదర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు

ఏపీఎస్ ఆర్టీసీ, టీజీఆర్టీసీకు కేటాయించే శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లలో అవకతవకలు జరిగాయని తేలితే కోటా రద్దు చేయాలని నిర్ణయం

శ్రీ‌వారి ఆల‌యంలో లీకేజీల నివార‌ణ‌, అన్న ప్ర‌సాద కేంద్రం ఆధునికీక‌ర‌ణ‌కు టీవీఎస్ సంస్థతో ఒప్పందానికి టీటీడీ నిర్ణయం. ఈ ప‌నులు ఉచితంగా చేయ‌నుంది

గోగ‌ర్భం డ్యామ్ వ‌ద్ద విశాఖ శ్రీ శార‌ద పీఠానికి చెందిన మ‌ఠం నిర్మాణంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు తేలడంతో లీజును ర‌ద్దు చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యం

తిరుమల డంపింగ్ యార్డులోని చెత్తను వచ్చే 3, 4 నెలల్లో తొలగించేందుకు చర్యలు, శ్రీనివాస సేతు వంతెనకు గడుణ వారధిగా నామకరణం