పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేశారు. శనివారం రాత్రి 7.05 గంటలకు పూజారులు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు తెరవనున్నారు దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య చంద్రగ్రహణం పూర్తి శుద్ధి చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని శనివారం సాయంత్రం 6 గంటలకు మూసివేశారు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం అనుబంధ ఆలయాలను సైతం మూసివేశారు