తరచుగా అరటిపండు తినేసి తొక్క పడేస్తూ ఉంటారు. కానీ దానితో కూడ ప్రయోజనాలున్నాయ్.



అరటి తొక్కలని రెండు రోజుల పాటు నానబెట్టి ఆ టీ నీటిని మొక్కలకు పోయవచ్చు.



అరటి తొక్కలు కంపోస్ట్ లో వేసి దానిపై ఇతర చెత్త వేసి రిచ్ కంపోస్ట్ మెటీరియల్ తయారు చేయవచ్చు.



అరటి తొక్కలు నేలలో పాతి పెట్టుకోవచ్చు. అది ఎరువుగా ఉపయోగపడుతుంది.



అరటి తొక్కని నాలుగు లేదా ఐదు అంగుళాల లోతు ఉండే బాక్స్ లో మట్టిలో కప్పి పెట్టాలి.



ఆ తొక్కలు వేసిన భూమిలో ఒక అంగుళం లోతులో ఏవైనా విత్తనాలు వేస్తే బాగా
మొలకెత్తుతాయి.


బాటిల్ నీళ్ళలో అరటి పండు తొక్కలు, గుడ్డు పెంకులు, కాల్షియం సప్లిమెంట్లు, ఎప్సమ్ సాల్ట్
వేసి ఎరువుగా పిచికారీ చేసుకోవచ్చు.


మొక్కలకి సహజమైన ఎరువుగా ఉపయోగపడుతుంది.



అరటిపండు వెనిగర్ చేసి మొక్కలకు స్ప్రే చెయ్యచ్చు.
Images Credit: Pexels