కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కొన్ని ప్రత్యేక నియమాలను నిపుణులు సూచిస్తున్నారు.

ఆహారంలో విటమిన్లు ఎ,సి,ఇ తో పాటు జింక్, ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన క్యారెట్లు, ఆకుకూరలు, సిట్రస్ పండ్లు, గింజలు, చేపలు చేర్చుకోవాలి.

హైడ్రేటెడ్ గా ఉండడం చాలా ముఖ్యం. డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగాలి.

కంటి కండరాలను బలోపేతం చేసే కళ్లు గుండ్రంగా తిప్పడం, నిర్ణీత వ్యవధిలో రెప్పలార్పడం వంటి వ్యాయామాలు చెయ్యాలి.

ఎక్కువ సమయం పాటు డిజిటల్ స్క్రీన్ వాడడం వల్ల కళ్ల మీద భారం పడుతుంది.

ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరం కనీసం 20 సెకండ్ల పాటు చూస్తుండడం అవసరం.

చదువుతున్నా, ఏదైనా పనిచేస్తున్నా కంటికి కష్టంగా అనిపించే వెలుగు లేకుండా చూసుకోవాలి. తగినంత వెలుతురులో పనిచెయ్యాలి.

యూవీ కిరణాల నుంచి కాపాడే సన్ గ్లాసెస్ వాడాలి.

తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అందువల్ల సమస్యలు ఏవైనా మొదలైతే వెంటనే గుర్తించవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels