ఎముకలు బలంగా మారాలంటే ఈ టిప్స్ పాటించండి! ఎముకలు బలంగా ఉంటేనే ఏ పని అయినా చేసుకోగలుగుతాం. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎముకల దృఢత్వం కోసం పాల ఉత్పత్తులు, సీ ఫుడ్స్, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఉదయం, సాయంత్రం కాసేపు ఎండలో గడిపితే విటమిన్ D లభించి ఎముకలు బలంగా మారుతాయి. ఎముకలు బలంగా ఉండేందుకు ఆరోగ్యకరమైన శరీర బరువు ఉండేలా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలు హెల్దీగా ఉండాలంటే స్మోకింగ్, మద్యపానానికి దూరంగా ఉండాలి. All Photos Credit: Pixabay.com