ఈ మధ్య రకరకాల కారణాలతో చాలా మంది నిద్ర లేమి సమస్యతో బాధపడుతున్నారు. ఎలా జయించాలో తెలుసుకుందాం.

నిద్ర పొయ్యేందుకు ఒక స్థిరమైన షెడ్యూల్ పెట్టుకోవాలి. ఒకే సమయానికి నిద్ర పోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం అవసరం.

పడుకునే ముందు ఫోన్, కంప్యూటర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ స్లీప్ హార్మోన్‌లకు అంతరాయం కలిగిస్తుంది.

పడుకునే ముందు బుక్ చదవడం, వేడి నీటి స్నానం వంటి ఏదైనా రిలాక్సింగ్ పని చేస్తే త్వరగా నిద్ర వస్తుంది.

సాయంత్రం తీసుకునే ఆహారం మీద కచ్చితంగా దృష్టి పెట్టాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం జీవితంలో భాగం చేసుకోవాలి.

పడకగదిలో ఎక్కువ వెలుగు లేకుండా, నిశ్శబ్ధంగా ఉండేట్టు చూసుకోవాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇందుకు శ్వాస వ్యాయామాలు, మెడిటేషన్, తీవ్రమైన ఆలోచనల నుంచి దృష్టి మళ్లించడం వంటివి చెయ్యాలి.

మధ్యాహ్నం తీసే కునుకు 20 నిమిషాలకు మించకుండా జాగ్రత్త పడాలి.
Images courtesy: Pexels