మనం రోజు వారీ తీసుకునే ఆహారం వల్ల చాలా వరకు పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటుంది. కొన్ని సులభమైన వర్కవుట్లతో పొట్ట తగ్గించుకునే మార్గాలను గురించి తెలుసుకుందాం. రష్యన్ ట్విస్టులతో స్లిమ్ గా మారొచ్చు. వీపు కండరాలు టోన్ కూడా అవుతాయి. బరువు తగ్గవచ్చు. ఫ్లెక్సిబిలిటి పెరుగుతుంది. బర్పీస్ రెయిజ్ ద్వారా జీవక్రియలు వేగవంతం చేసుకోవచ్చు. కండరాలు పటిష్టంగా తయారవుతాయి. యోగాతో పొట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది. పొట్టదగ్గరి కండరాలు టోన్ అవుతాయి. బరువు కూడా తగ్గుతారు. నిర్ణీత విరామాలతో తీవ్రమైన వర్కవుట్లు చెయ్యడం ద్వారా త్వరగా క్యాలరీలను ఖర్చు చెయ్యవచ్చు. ఫలితంగా కొవ్వు కరిగిపోతుంది. బాల్ ప్లాంక్ వల్ల పొట్ట చాలా సులభంగా కరుగుతుంది. జీవక్రియలు వేగవంతం అవుతాయి. కోర్ కండరాలు బలోపేతం అవుతాయి. వాకింగ్ ద్వారా పొట్ట దగ్గరి కొవ్వు తగ్గించుకోవచ్చు. నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా తగ్గించుకోవచ్చు. మౌంటైన్ క్లైంబింగ్ మంచి ఇంటెన్సిటీ కలిగి వ్యాయామం. దీనితో మొండి పొట్ట దగ్గరి కొవ్వును తగ్గించుకోవడం సులభం. Images courtesy : Pexels