ఎండు ద్రాక్ష తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎండు ద్రాక్షలో విటమిన్లు సి, కె, బి, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజలవణాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.

ఎండుద్రాక్షలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఎండుద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి, వీటితో వెంటనే శక్తి లభిస్తుంది.

ఎండుద్రాక్షలో ఉండే పొటాషియం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది.

ఎండుద్రాక్షలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తాయి. కాల్షియం శోషణకు అవసరమయ్యే బోరాన్ కూడా ఇందులో ఉంటుంది.

ఎండుద్రాక్షలో ఫ్లవనాయిడ్స్, ఫినోలిక్ ఆసిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆక్సికరణ ఒత్తిడి తగ్గుతుంది.

ఎండుద్రాక్షతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కనుక రక్తవృద్ధికి దోహదం చేస్తుంది.

తక్కువ క్యాలరీలు కలిగిన ఈ ఎండు ఫలాలతో బరువు తగ్గుతారు. చర్మ ఆరోగ్యం కూడా బావుంటుంది.
Images courtesy : Pexels