హైక్వాలిటీ ఎక్స్ ట్రా వర్జిన్ ఆలీవ్ ఆయిల్ గుండె, కీళ్లు, మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

దీనిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం. ఆలీవ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

ఆలీవ్ ఆయిల్ ను తమ డైట్ లో భాగం చేసుకున్న వారిలో స్ట్రోక్ ప్రమాదం తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆలీవ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల జీవక్రియలు మెరుగు పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలను నిరోధించబడుతాయి.

ఆలీవ్ నూనెలోని పోషకాలు ముఖ్యంగా ఒలెయిక్ ఆసిడ్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి.

ఎక్స్ ట్రా వర్జిన్ ఆలీవ్ నూనె మెడిటేరానియన్ డైట్ లో ముఖ్యమైన పదార్థం. రకరకాల విధానాల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మోతాదుకు మించకుండా తీసుకున్నపుడు బరువు తగ్గేందుకు కూడా దోహదం చేస్తుంది.

Images courtesy : Pexels