పుదీనాతో ఆ నొప్పి మాయం



పుదీనాలో ఎన్న ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తారు.



పుదీనాలో ఉండే గుణాలు అలెర్జీ, ఆస్తమా వంటి వాటిని తగ్గిస్తాయి.



పుదీనాలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.



పుదీనాను తినడం వల్ల నోటిలోని బ్యాక్టిరియాలు మరణిస్తాయి.



ఈ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే ఎంతో మంచిది.



చర్మం దురద పెడుతున్నప్పుడు పుదీనా ఆకులను బాగా నలిపి దురద వచ్చిన చోట రాసుకోవాలి.



గొంతు నొప్పి వేధిస్తున్నప్పుడు నీటిలో పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి, ఆ నీటితో పుక్కిలించాలి.



పుదీనాలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి.