రాత్రి ఆలస్యంగా నిద్రపోతే అంత ప్రమాదమా?

రాత్రి త్వరగా నిద్రపోవాలని, తెల్లవారుజామునే లేవాలని పెద్దలు చెబుతుంటా.

కానీ, ఇప్పుడు ఎవరూ అది పాటించడం లేదు. ఫలితంగా.. రోగాలు వస్తున్నాయ్.

మధుమేహం, గుండె జబ్బులు త్వరగా రావడానికి కారణం కూడా అదే.

తాజా అధ్యయనం ఆలస్యంగా నిద్రపోయేవారి గురించి షాకింగ్ విషయం చెప్పింది.

ఆలస్యంగా నిద్రపోతే శక్తి కోసం కొవ్వును కరిగించే సామర్థ్యం తగ్గిపోతుందని పేర్కొంది.

దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా రక్తంలో కూడా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.

కొవ్వు వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. దానివల్ల గుండె జబ్బులు వస్తాయి.

టైప్ 2 డయాబెటిస్ కూడా నిద్రలేమి, ఆలస్యంగా నిద్రపోవడం వల్లే వస్తుంది.

సిర్కాడియన్ రిథమ్ దెబ్బతినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ లోపాలు తలెత్తుతాయి.

ఈ విషయాన్ని అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు.

ఈ విషయాన్ని అమెరికాలోని రట్జర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తెలిపారు.

చూశారుగా, ఇకనైనా సమయానికి నిద్రపోండి. ఆరోగ్యంగా ఉండండి.

Images Credit: Pexels, Pixabay and Unsplash