బంగాళాదుంపలు తొక్కతో తింటే ఎన్ని లాభాలో చాలా మంది తొక్కను ఒలిచేస్తారు. తొక్కను తీసేయడం వల్ల ఎన్ని నష్టాలో తెలుసా? బంగాళాదుంప తొక్కల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ తొక్కలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, గ్లైకోఅల్కలాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలోని కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయి. బంగాళాదుంపలను తొక్కతో పాటూ తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుంది. వీటిలో యాంటీ బ్యాక్టిరియల్, ఫినాలిక్, యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉంటాయి. తొక్కలను ముఖంపై మొటిమలు, మచ్చలున్న చోట రుద్దుకుంటే మంచిది. ఈ తొక్కల్లో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం, రాగి, జింక్ అధికంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరమైనవి. బంగాళాదుంప తొక్క నుంచి తీసిన రసంతో తలకు మసాజ్ చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. బంగాళదుంప వేపుడు వంటివి తొక్కతో కలిపి చేస్తేనే టేస్టు అధికంగా ఉంటుంది.