కంటి చూపును పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే

చిక్కుళ్లు లేదా బీన్స్: వీటినే కాయధాన్యాలంటారు.

వీటిలోని బయోఫ్లావనాయిడ్స్, జింగ్ రెటీనా‌ను కాపాడతాయి.

నట్స్, సన్ ఫ్లవర్ విత్తనాలు: వీటిని రోజూ తీసుకోవాలి.

వీటిలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.

పచ్చని ఆకు కూరలు: పిల్లలకు బాల్యం నుంచే ఈ ఆకు కూరలు తినిపించాలి.

బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో కంటిని రక్షించే విటమిన్-సి, ఇ ఉంటాయి.

రంగు రంగుల కాయగూరలు, పండ్లు క్రమం తప్పకుండా తినాలి.

క్యారెట్, టమోటో, పెప్పర్స్, స్ట్రాబెర్రీస్, గుమ్మడి, మొక్క జొన్నల్లో విటమిన్-ఎ, విటమిన్-సి ఎక్కువ.

పుల్లగా ఉండే పండ్లు: పుల్లని పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.

ఆరెంజ్, ద్రాక్ష పండ్లు, నిమ్మ, బెర్రీస్‌లో విటమిన్-సి ఎక్కువ.

విటమిన్-సి కంటిశుక్లం, మాక్యులర్ క్షీణతను దరిచేరకుండా కళ్లను కాపాడుతుంది.

Images and Videos Credit: Pexels