కంటి చూపును కాపాడే ఆహారాలు ఇవే కంటిచూపుకు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు రోజూ తినాలి. వాటిల్లో ముఖ్యమైనవి ఇవే. చేపలు. వీటిల్లో ఉండే ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేరు శెనగపలుకులు. ఇందులో జింక్ కంటి పనితీరును మెరుగుపరుస్తాయి. పాలకూర. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కంటికి అత్యవసరమైన విటమిన్ ఇది. సన్ ఫ్లవర్ గింజలు. వీటిలో ఉండే విటమిన్ ఇ కంటిచూపు తగ్గకుండా కాపాడుతుంది. బాదం పప్పు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రెటినాను కాపాడుతాయి. బ్రకోలి. విటమిన్ సి అధికంగా ఉంటుంది ఇందులో. క్యారెట్. వీటిలో కూడా విటమిన్ ఎ పుష్కలం. గుడ్లు. రేచీకటి రాకుండా అడ్డుకుంటాయి ఇందులోని పోషకాలు.