బతుకమ్మ పండుగ, తొమ్మిది రోజులు... ఎనిమిది నైవేద్యాలు

బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ. ప్రతి రోజూ ఒక నైవేద్యాన్ని నివేదిస్తారు.

మొదటి రోజు - ఎంగిలి పూల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల పిండి

రెండో రోజు - అటుకుల బతుకమ్మ
నైవేద్యం - సప్పిడి పప్పు, బెల్లం - అటుకుల స్వీట్

మూడో రోజు - ముద్దపప్పు బతుకమ్మ
నైవేద్యం - ముద్దపప్పు

నాలుగో రోజు - నానబియ్యం బతుకమ్మ
నైవేద్యం - బెల్లమన్నం

అయిదో రోజు - అట్ల బతుకమ్మ
నైవేద్యం - అట్లు లేదా దోశెలు

ఆరో రోజు - అలిగిన బతుకమ్మ
ఈ రోజు ఎలాంటి నైవేద్యాన్ని సమర్పించరు

ఏడో రోజు - వేపకాయల బతుకమ్మ
నైవేద్యం - బియ్యంపిండితో చేసే వేపకాయలు

ఎనిమిదో రోజు - వెన్నముద్దల బతుకమ్మ
నైవేద్యం - వెన్నముద్దలు

తొమ్మిదో రోజు - సద్దుల బతుకమ్మ
నైవేద్యం - నువ్వుల సద్ది